news
 
Latest News   
 
1
మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నాడంటూ కథనం.. మండిపడుతున్న తమ్ముళ
మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నాడంటూ కథనం.. మండిపడుతున్న తమ్ముళ్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఏపీలో విజయం ఎవరిని వరిస్తుంది? అనే అంశం ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. జగన్మోహన్ రెడ్డి ఆంద్రాకు కాబోయే ముఖ్యమంత్రి అని సౌండ్ బాగా వినపడుతున్న నేపథ్యంలో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామలపై సంచలన కథనాలు రాస్తున్నాయి పలు పత్రికలు. తాజాగా నారా లోకేష్ పైన ఆసక్తికర కథానాన్ని ప్రచురించింది ఓ తమిళ పత్రిక. నారా లోకేష్ తొలిసారిగా మంగళగిరి నుంచి ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాలుగా మంగళగిరి నుంచి తెలుగుదేశానికి ప్రాతినిధ్యం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరున్న ఈ నియోజకవర్గం ప్రస్తుతం వైసీపీ కోటాలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఓ పత్రిక ‘దిన మలర్’ మంగళగిరిలో నారా లోకేష్‌ ఓడిపోతున్నాడన్నది ఆ కథనం సారాంశం. లోకేష్ మంత్రిగా ఉండి కూడా గెలుస్తానన్న ధైర్యం ఆయనలో లేదంటూ ప్రచురించింది. తమిళ పత్రికలో లోకేష్ గెలుపుపై ఇలాంటి కథనాలు ప్రచురించడంతో మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. మంగళగిరి లోకేష్ గెలుపును ఎవరూ ఆపలేరని అంటున్నాయి పార్టీ వర్గాలు. మరి ఏం జరుగుతుందో మే 23 వరకూ వేచి చూడాల్సిందే.
Published on Saturday, May 11, 2019
2
వైరల్ అవుతున్న ఏపీ ఇంటిలిజెన్స్ సర్వే..?
వైరల్ అవుతున్న ఏపీ ఇంటిలిజెన్స్ సర్వే .. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఇంకో నెలపైనే ఉన్నప్పటికీ అందరూ మాత్రం వాటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా జగన్ గెలవబోతున్నాడని..ఏపీ ముఖ్యమంత్రి జగనే అంటూ అంత చెపుతుంటే..తాజాగా సోషల్ మీడియా వాట్సాప్ లో ఏపీ ఇంటిలిజెన్స్ సర్వే అంటూ ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఈ సర్వే లో వైసీపీ 120 స్థానాల్లో విజయ డంఖా మోగించబోతుందని..వైసీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, అవంతి శ్రీనివాస్, కోలగట్ల వీరభద్రస్వామి, రోజా, లాంటి వాళ్లు ఓడిపోతున్నట్లు తెలిపారు. విశాఖపట్నం సౌత్, వెస్ట్, ఈస్ట్ మూడుచోట్లా టీడీపీ గెలస్తుందని .. గాజువాకలో పవన్ గెలుస్తాడని లెక్క కట్టారు. నరసాపురం, ఉండి, తణుకు, తాడేపల్లి గూడెం, దెందులూరు, ఏలూరు ఇవన్నీ టీడీపీనే గెల్చుకుంటుందని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అలాగే రాయలసీమలోని ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప ప్రాంతాల్లో ఎక్కువగానూ, మిగిలిన చోట్ల పోటాపోటీగా వైకాపా సీట్లు గెలుచుకుంటుదని ఆ పోస్ట్ లో పేర్కోన్నారు. మరి వీరు చెప్పినట్లు జరుగుతుందా లేదా అనేది మే 23 న తెలుస్తుంది.
Published on Sunday, April 21, 2019
3
తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల..
తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల జోరు మొదలు కాబోతుంది. ఇటీవలే శాసన , గ్రామపంచాయితీ, ఎంపీ ఎన్నికలు జరుగగా..తాజాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసారు. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మే 6న తొలి దశ, మే 10న రెండో దశ, మే 14న మూడో దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 27న ఓట్ల లెక్కింపు చేపడతామని నాగిరెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఈసారి ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్ వేసే సౌలభ్యాన్ని కూడా కల్పించారు. ఐతే అప్లికేషన్ పూర్తయ్యాక ప్రింట్ అవుట్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల నిర్వహణకు 32,042 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. జడ్పీటీసీ అభ్యర్థులు రూ.4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.లక్షా 50వేలు గరిష్ఠ వ్యయ పరిమితి విధిస్తున్నట్లు ఆయన వివరించారు. సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేయవచ్చని.. అయితే, ఫలితాల తర్వాత వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.
Published on Sunday, April 21, 2019
4
నువ్వు ఆ హీరోయిన్‌తో ప‌క్క‌లేయించావ్‌:త‌మ‌న్నా
హీరో శివాజీ గ‌త కొంత‌ కాలంగా `ఆప‌రేష‌న్ గ‌రుడ` పేరుతో బీజేపీ ఏపీతో పాటు ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కుట్ర చేస్తోంద‌ని వైట్ బోర్డ్ పై గీతలు గీస్తూ లెక్క‌లు వేస్తూ ఆస‌క్తిక‌ర లాజిక్కుల‌తో మ్యాజిక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అత‌ని మ్యాజిక్ బోగ‌స్ అని, అత‌నో ప్యాకేజీ రాయుడ‌ని త‌మ‌న్నా నిప్పులు చెరిగారు. ఇంత‌కీ త‌మ‌న్నా అంటే హీరోయిన్ త‌మ‌న్నా కాదు. ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా. మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్‌కి పోటీగా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నిలిచిన త‌మ‌న్నా తాజాగా శివాజీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఒరేయ్ శివాజీ హీరోయిన్‌ల‌తో ప‌క్క‌లేయించావ్! ప్రూఫ్‌లు చూపించ‌నా!! అంటూ ఆమె చేసిన హంగామా స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది. అప్పుడ‌ప్పుడు జ‌నం ముందుకు వ‌చ్చి ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో హంగామా చేస్తున్నావ్‌. నీ గురించి జ‌నాల‌కు తెలుసు. నువ్వు కోట్ల రూపాయ‌లు తీసుకుని అబ‌ద్ధాలు ఆడుతున్నావ‌ని, ప్యాకేజీ తీసుకున్న‌వాడివి ప్యాకేజీ తీసుకున్న‌ట్టు వుండు, అమెరికా వెళ్లి నీకు న‌చ్చిన జ‌ల్సాలు చేసుకో కానీ ఆప‌రేష‌న్ గ‌రుడ 1, గ‌రుడ 2 అంటూ ఎక్కువ ఆప‌రేష‌న్‌లు చేశావంటే నీకు ఆప‌రేష‌న్ చేసి క‌ట్ చేయించాల్సి వ‌స్తుంది జాగ్ర‌త్త అంటూ ఘాటుగా స్పందించారామె. కోట్ల రూపాయ‌ల్లో ప్యాకేజీలు తీసుకుని ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో కొత్త డ్రామాలు మొద‌లుపెట్టావు. తీసుకున్న ప్యాకేల‌తో ఒడుకుల్ని అమెరికాలో చ‌దివిస్తున్నావు, ఇక్క‌డ స‌క‌ల సౌక‌ర్యాలు అనుభ‌విస్తున్నావు. నీకు కుల పిచ్చి. దాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించావు అంటూ ట్రాన్స్ జెండ‌ర్ త‌మ‌న్నా శివాజీపై నిప్పులు చెరగ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది.
Published on Sunday, April 21, 2019
5
చంద్ర‌బాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు!
చంద్ర‌బాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు! ఏపీ రాజ‌కీయాలు పూట‌కో మ‌లుపు తిరుగుతున్నాయి. ఎన్నిక‌లు పూర్త‌యినా ఫ‌లితాలు ఇంకా వెలువ‌డ‌టానికి స‌మ‌యం వుండ‌టంతో ర‌స‌వ‌త్త‌ర నాట‌కాల‌కు తెర‌లేస్తోంది. త‌న ఓట‌మి ఖాయ‌మ‌ని తేల‌డంతో ఈవీఎంల‌పై దేశవ్యాప్తంగా వ్య‌తిరేక‌త‌ను తీసుకురావ‌డం కోసం చంద్రబాబు నాయుడు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఇదిలా వుంటే బాబు ముఖ్య‌మంత్రి కావ‌డం ఈ ద‌ఫా క‌ల్లే అని సొంత పార్టీ నాయ‌కుల‌కు తెలిసిపోయిందా? అందుకే బాబుకు ముఖం చాటేస్తున్నారా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు నిజ‌మ‌నే సంకేతాల్ని అందిస్తున్నాయి. ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడు కర్నూల్‌లో ప‌ర్య‌టించారు. అక్క‌డ‌ ఎన్నిక‌ల స‌ర‌ళిపై జిల్లా నేత‌ల‌తో స‌మీక్ష నిర్వ‌హించాల‌నుకున్నారు. ఇందుకు భూమా అఖిల ప్రియ‌, బుడ్డా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, తిక్కారెడ్డిల‌తో పాటు కొత్త‌గా పోటీ చేసిన కె.ఈ. ప్ర‌తాప్, టీజీ భ‌ర‌త్‌, కేఈ శ్యాంబాబు, మీనాక్షీ నాయుడు త‌దిత‌ర స్థానిక నాయ‌కుల‌కు క‌బురు పెట్టారు. బాబు స‌మీక్షా స‌మావేశానికి ఎంత సేపు ఎదురు చూసినా ఎవ‌రూ రాలేదు. దీంతో వున్న వారితోనే బాబు స‌మీక్ష నిర్వ‌హించి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి పిలిచినా సొంత పార్టీ నేత‌లు వెల్ల‌క ముఖం చాటేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారం లోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని వారికి తెలియ‌డం వ‌ల్లే బాబును ఖాత‌రు చేయ‌లేద‌ని జిల్లా నేత‌లు చెబుతున్నారు
Published on Sunday, April 21, 2019
6
అధికారంలోకి రావడం క‌ష్ట‌మే..! రెండు పార్టీలకు షాకిస్తున్న..
ప్ర‌స్తుతం ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు సంబంధించిన అభ్య‌ర్ధులు ఫ‌లితాల కోసం విప‌రీత‌మైన ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి పోలింగ్ ట్రెండ్ ఎలా ఉంద‌నే అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. బూత్‌స్థాయిలో ఉన్న ట్రెండ్స్‌ను బ‌ట్టి ఓ అంచ‌నాకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎన్ని అంచ‌నాలు వేసుకుంటున్నా.. ఎన్ని లెక్క‌లను ముందేసుకుని కుస్తీలు ప‌డుతున్నా ఒక నివేదిక‌కు, మ‌రో నివేదిక‌కు పొంత‌న ఉండ‌టం లేద‌ట‌. లెక్క‌ల‌కు.. లెక్క‌ల‌కు మ‌ధ్య పోలిక అస‌లే ఉండ‌టం లేద‌ట‌. దీంతో స‌గం మంది నేత‌లు మ‌రింత గంద‌ర‌గోళానికి గుర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల గురించి లెక్క‌ల‌పై, అంచ‌నాల‌పై ఓ ప‌క్కా క్లారిటీ రాకున్నా.. రాష్ట్ర స్థాయిలో ప‌రిస్థితి ఎలా ఉంద‌నే అంశంపైనా ఆరాతీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో అధికారికంగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుందా..? రాదా..? అని వారి వారికి ప‌రిచ‌యం ఉన్న ప్ర‌తి ఒక్క‌ర్నీ అడిగి ఎవ‌రి రూట్ల‌లో వారు ఎన్‌క్వౌరీ చేసుకుంటున్నార‌ట‌. ఈ క్ర‌మంలో తెలుగుదేశం పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంతో పోల్చుకుంటే ఎనాల‌సిస్ విష‌యంలో టీడీపీ కొద్దిగా వెన‌క‌ప‌డింద‌ని వారు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. దీంతో పార్టీలోని అగ్ర‌నేత‌లు మొద‌లుకొని అంద‌రికీ కాస్తో కూస్తో అనుమానాలు వ‌స్తూనే ఉన్నాయి. పార్టీలోని అగ్ర‌నేత‌ల‌కు వారి వారి సెగ్మెంట్‌ల‌లోని ప‌రిస్థితిని వివ‌రిస్తూనే ఆ జిల్లాకు సంబంధించిన లెక్క‌ల‌ను వివ‌రిస్తున్నారు. పార్టీ ప్ర‌చార కార్యక్ర‌మాల‌కు పై నుంచి రావాల్సిన ఫండ్స్ స‌కాలంలో రాక తాము ఇబ్బంది ప‌డ్డామ‌ని, అయితే కిందా..మీదాప‌డి ఎలాగోలా విజ‌య‌మే ల‌క్ష్యంగా త‌ము ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ముగించామ‌ని, కానీ కొంద‌రు అభ్య‌ర్ధులు మాత్రం టీడీపీ హైక‌మాండ్ త‌మ‌కు స‌రైన రీతిలో చేయూత‌నందించ‌లేద‌న్న విష‌యాన్ని చెప్పుకొస్తున్నారు. మొత్తంగా పార్టీ గెలుపు అంశంపై ధీమాగా ఉండే విష‌యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ శ్రేణులు సైతం త‌డ‌బడుతూ స‌మాధానాలు చెబుతున్నారు. పూర్తిస్థాయి కాన్పిడెన్స్ వారిలో క‌నిపించ‌డం లేదు. జ‌న‌సేన ప్ర‌భావం టీడీపీపై ప‌డింద‌న్న శంస‌యం వారిలో పూర్తిస్థాయిలో క‌నిపిస్తోంది. జ‌న‌సేన‌కు ప‌డిన ఓట్ల విష‌యంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల టీడీపీ నేత‌లు కొంత డీలా ప‌డిన‌ట్టు క‌నిపిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికలు ఏమో కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబందించిన ఫలితాలు పైనే అందరి దృష్టి ఉంది.మూడు బలమైన పార్టీల నడుమ పోటీ జరగడంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయంలో మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే ఇదిలా ఉండగా అనేక రకాల సర్వేలు బయటకు వచ్చి తెగ హడావుడి చేసేస్తున్నాయి.జనసేన పార్టీని మినహాయిస్తే అయితే వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ లేదా మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆ సర్వేలలో వెల్లడవుతుంది. అయితే ఇప్పుడు ఈ సర్వేల వలనే ఈ రెండు పార్టీల శ్రేణులు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తుంది.ఆ పార్టీకి చెందిన నేతలే తమకి తాము నిర్వహించుకునే సర్వేలలోనే ఒక్కోసారి ఒక్కో విధమైన ఫలితాలు వస్తుండడంతో మే 23న రాబోయే ఫలితాలలో ఎలాంటి వార్త వినాల్సొస్తుందో ఏమో అని ఇప్పటి నుంచే తెగ టెన్షన్ పడుతున్నారట.ఈ టెన్షన్ తెలుగుదేశం పార్టీ వారికైతే మరీ ఎక్కువగా కనిపిస్తుందట కానీ వైసీపీకి మాత్రం ఎదో అరకొర సర్వేలు మినహా మిగతా అన్ని చోట్ల బలమైన ఫలితాలు వస్తున్నాయని తెలుస్తుంది.దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ కంటే కూడా వైఎస్సార్సీపీకే గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది.ఈసారి మాత్రం జగనే కాబోయే ముఖ్యమంత్రి అని జగన్ అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.మరి వీరి సంకల్పం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే వచ్చే మే 23 వరకు ఆగక తప్పదు.
Published on Sunday, April 21, 2019

 

First Previous 1 2 3 4 5  ... Next Last 
 
   
Rewards Achiever List  
 
Top Achiever List  
 
OM
Maddirala SunilRaju1
PRIMA
vijayawada
P.VISHNU
BRAMHA
SRIKRISHNA
Dhairya Lakshmi
SHIVA
SRIRAMA
Santana Lakshmi