news
 
Latest News   
 
1
ప్రకాశం: వైసీపీ మహిళా నేత కారుకు ఏపీ మంత్రి స్టిక్కర్.. ఆసక్
ప్రకాశం: వైసీపీ మహిళా నేత కారుకు ఏపీ మంత్రి స్టిక్కర్.. ఆసక్తికర చర్చ తాజాగా మరో మంత్రి స్ట్రికర్‌ వ్యవహారం హాట్‌టాపిక్ అయ్యింది. ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత వాహనానికి..కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ఎమ్మెల్యే, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేరిట ఉన్న స్టిక్కర్‌ను ఉపయోగిస్తున్నారు. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేల స్టిక్కర్ల వ్యవహారంపై రగడ నడుస్తోంది. తమిళనాడులో రూ.5.27 కోట్లతో కారు పట్టుబడిన వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. డబ్బు తరలిస్తున్న కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండడంతో వివాదంగా మారింది. కొంతమంది ఎమ్మెల్యేల స్టికర్లను ఉపయోగిస్తున్న రాజకీయ నాయకులు తమ వాహనాల నుంచి వాటిని తొలగించారు. కానీ కొంతమంది మాత్రం స్టిక్కర్లను తొలగించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో మంత్రి స్ట్రికర్‌ వ్యవహారం హాట్‌టాపిక్ అయ్యింది. ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత వాహనానికి..కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ఎమ్మెల్యే, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేరిట ఉన్న స్టిక్కర్‌ను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఆమె ఒంగోలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తమిళనాడులో డబ్బుల వ్యవహారంపై ఒంగోలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు హాజరయ్యారు. ఆమె మంత్రి స్టిక్కర్ ఉన్న వాహనంలో రావడం చర్చనీయాంశమైంది.
Published on Tuesday, July 21, 2020

 

First Previous 1 Next Last 
 
   
Rewards Achiever List  
 
Top Achiever List  
 
Trimukha Durgadevi
PRIMA
vijayawada
Bramarambhika
Asta Laxmi
Danya Laxmi
Durga Bhavani
Dana Laxmi
VIJAYA
Vijaya Laxmi
Durga Malleswari